ములుగు, 2026-07-25
బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జాహ్నవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్ అండగా నిలిచారు. శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానికులు ఈ సేవను అభినందించారు.
ములుగు జిల్లా (నూగూర్) వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో గుండారపు రాజేష్, మమత దంపతుల కుమార్తె చిన్నారి జాహ్నవి గత కొన్ని సంవత్సరాలుగా బోన్ మ్యారోకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్సకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పాప తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ విషయం స్థానిక యువత ద్వారా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్ దృష్టికి చేరింది. ఆయన శనివారం స్థానిక నాయకులతో కలిసి చిన్నారి జాహ్నవి ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాప తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, చిన్నారికి నయమవుతుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా, బాడిశ నాగరమేష్ తన సంస్థ అయిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ద్వారా చిన్నారి జాహ్నవి తల్లిదండ్రులు రాజేష్, మమతలకు రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ తమ వంతు సహాయం అందిస్తున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ కు, ఆ సంస్థ చైర్మన్ బాడిశ నాగరమేష్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బెస్తగూడెం సర్పంచ్ బట్టా భీమేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మంచర్ల నాగేశ్వరరావు, బట్టా నాగేంద్ర బాబు, వీరభద్రవరం సర్పంచ్ చౌలం ఓంపతీ, కొమరం పుల్లారావు, పండ శ్రీను, రూప భద్రయ్య, సంతోష్, బన్ను, మాటూరి వెంకటేశ్వర్లు, బట్టా పురుషోత్తం, సుదర్శన్, దారాజు కృష్ణమూర్తి, బెగా సాంబాశివరావు, రామేళ్ల రాజా శేఖర్, రాకేష్, లక్ష్మీనారాయణ, రంజిత్, బట్టా జగదీష్, చంటి, గోవర్ధన్, మంచెర్ల వంశీ, తాటి వెంకటేష్, బట్టా వీరాస్వామి, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ పాల్గొన్నారు.











