ములుగు, 2026-07-28
ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. నీటి సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు.
ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని, వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలను పెంచడానికి కృషి చేయాలని తెల్లం వెంకట్రావు అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులు వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశం అనంతరం సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, 18 పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








