కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
రేపు (12-06-2026) చర్లలో జరగనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజయ్ నాయుడు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని కాంగ్రెస్ పార్టీ , బీఎల్ఏలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.






