ములుగు, 2026-07-18
ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి పంచాయితీకి స్థానికేతరులైన ఫీల్డ్ అసిస్టెంట్లు నియామకాన్ని ఏఎన్ఎస్ మండల అధ్యక్షులు మోడెం. నాగరాజు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేసా గ్రామ సభ తీర్మానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పేసా గ్రామ సభ తీర్మానాన్ని పటిష్టంగా అమలు చేయాలని గుమ్మడిదొడ్డి గ్రామ ప్రజలు కోరారు. ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి పంచాయితీకి నూతనంగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ (FA) ములుగు నుండి స్థానికేతరులు (గిరిజనేతరులు) రావటాన్ని ఏఎన్ఎస్ మండల అధ్యక్షులు మోడెం. నాగరాజు వ్యతిరేకించారు.
గుమ్మడిదొడ్డి పంచాయితీలో ఫీల్డ్ అసిస్టెంట్ కారం చిరంజీవి మరణించడంతో, అతని భార్య కారం. జ్యోతి సీనియర్ మెటుగా 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ములుగు నుండి నూతన ఫీల్డ్ అసిస్టెంట్ గా గుమ్మడిదొడ్డికి ఒకరు రావడం జరిగింది. నూతనంగా వచ్చిన వారిని తొలగించి, స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని గుమ్మడిదొడ్డి గ్రామ ప్రజలు పేసా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాలలో 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ' (VB-G RAM G) ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో స్థానికేతరులు (Non-Locals) పనిచేయడానికి వీలులేదని, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ మరియు స్థానిక గిరిజన చట్టాల ప్రకారం, ఏజెన్సీ ఏరియాలో క్షేత్రస్థాయి పోస్టులు పూర్తిగా స్థానిక షెడ్యూల్ తెగలకు (Local STs) లేదా ఆయా గ్రామాల స్థానిక నివాసితులకు మాత్రమే కేటాయించబడతాయని స్పష్టం చేశారు. స్థానికేతరులను ఈ పోస్టులలో నియమించడం చట్టవిరుద్ధమని, గిరిజన చట్టాలను గౌరవించి అధికారులు పనిచేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా MPDO కృపాకర్ సార్ గారిని గుమ్మడిదొడ్డి ప్రజలు కలిసి తమ వినతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎస్ మండల అధ్యక్షులు మోడెం. నాగరాజు, జిల్లా నాయకులు ఎట్టి. విద్యాసాగర్, తుడుందెబ్బ నాయకులు పాయం. జానకి రమణ, కారం. సురేందర్, జజ్జరీ. రాజబాబు పాల్గొన్నారు.







