భద్రాద్రి కొత్తగూడెం, 2026 జూలై 31, శుక్రవారం
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగష్టు 10న చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించారు.
నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగష్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బందెల చంటి, రైతు సంఘం మండల కార్యదర్శి నల్లగట్ల నర్సింహమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం నాడు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంపదను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల ప్రయోజనం కోసం 29 కార్మిక చట్టాలను మార్చిందని తెలిపారు.
కార్మిక చట్టాలను మార్చడం వల్ల ఎనిమిది గంటల పని హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టం, సంఘం పెట్టుకునే హక్కులను హరిస్తుందని ఆయన విమర్శించారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని రైతులు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర చట్టం చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఉన్న రైతాంగానికి నష్టం కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు.
పత్తి, మొక్కజొన్న, పాడి ఉత్పత్తులను, కోడి కాళ్ళను దిగుమతి చేసుకోవడానికి జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీరామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతన విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టాలను తెచ్చి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగష్టు 10వ తేదీన క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.












