ములుగు, 2026-06-05
ములుగుఘన్పూర్ ప్రాంతానికి సాగునీటి సరఫరాను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రామప్పలక్నవరం కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అధికారులను ఆదేశించారు. ములుగు ఆర్ అండ్ బి అతిథి గృహంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కాలువల పనులపై సమీక్ష
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ములుగుఘన్పూర్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఫీడర్ కాలువల ద్వారా నీటి సరఫరా, రామప్పలక్నవరం కాలువల పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ములుగుఘన్పూర్ ప్రాంతానికి నీరు చేరేందుకు రామప్ప జలాశయంలో అవసరమైన నీటి మట్టం నిర్వహణ, ఫీడర్ ఛానళ్ల ద్వారా నీటి ప్రవాహం జరిగే విధానం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు.
త్రాగునీటి సరఫరాపై ఆదేశాలు
త్రాగునీరు సకాలంలో అందేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామప్పలక్నవరం కాలువల పనులు, కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కాలువల విస్తరణ, మరమ్మతు పనుల పురోగతిపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.
మెరుగైన సేవలకు సూచన
ములుగుఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న నీటిపారుదల అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కృష్ణవేణి, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు ఈఈ నారాయణ, భూపాలపల్లి ఈఈ రాము, ప్రజా ప్రతినిధులు, సంబంధిత డీఈలు, జేఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.