ఏలూరు, 7 July
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS గారి ఆదేశాల మేరకు, ఏలూరు ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐలు శ్రీ శివాజీ, శ్రీధర్ పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS గారి ఆదేశాల మేరకు, ఏలూరు ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐలు శ్రీ శివాజీ, శ్రీధర్ గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏలూరు పోలీస్ డార్మిటరీలో జరిగిన ఈ కార్యక్రమంలో, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని సూచించారు. అనుమతించిన ఆటో స్టాండ్లలో మాత్రమే ఆటోలను నిలిపివేయాలని, ప్రయాణికుల నుంచి నిర్ణయించిన చార్జీలకే పరిమితం కావాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచనలు జారీ చేశారు.
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆటోలను నడపరాదని హెచ్చరిస్తూ, "రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత" అని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.












