శాలివాహన (ప్రజా వాయిస్ సహస్ర) నవంబర్ 19
కార్తీక మాసం, అయ్యప్ప స్వాముల యాత్రలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం మణుగూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. పంచారామ క్షేత్రాలు, అన్నవరం, అరుణాచలం, శబరిమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ కే. శ్యాంసుందర్ తెలిపారు.
కార్తీక మాసం, అయ్యప్ప స్వాముల యాత్రలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం మణుగూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. పంచారామ క్షేత్రాలు, అన్నవరం, అరుణాచలం, శబరిమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ కే. శ్యాంసుందర్ తెలిపారు. దూరప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను భక్తులు సులభంగా దర్శించుకునేందుకు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఆర్టీసీ బస్సుల్లో సమూహాలుగా ప్రయాణించేలా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల వివరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీమొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దండా నర్సింహారావు, గౌరవ సలహాదారు గంగాధర వీరయ్య, వ్యవస్థాపకులు చెరుకుపల్లి ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పాడ అనిత, ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, కోశాధికారి రాయపరెడ్డి సత్యనారాయణ, పూజారులు జ్యోతి, జోష్ణ, సుశాంతి, మండల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోమర కుమార్, శీను, మాలోతు రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బస్సులపై భక్తులకు అవగాహన కల్పించేందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



