కొత్తగూడెం, 2026-09-04
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణ దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
*భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణ* తేదీ: 04-09-2026 స్థలం: భద్రాచలం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. మాడవీధులు, గోశాల, ఉత్తర ద్వారం ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని అధికారులకు సూచించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందేలా ఆలయ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్, జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆలయ అధికారులు, అర్చకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








