మంగపేట (ప్రజా వాయిస్ సహస్ర) నవంబర్ 18
రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ములుగు జిల్లాలోని కమలాపురం గ్రామంలో వీబీ-జీ రామ్ జీ పథకం కింద మంజూరైన ఇంకుడు గుంతలను పరిశీలించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క మరియు ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు అశోక్ ఆదేశాల మేరకు, మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ఈరోజు పర్యటించారు. మండలం లోని కమలాపురం గ్రామంలో వీబీ - జీ రామ్ జీ పథకం కింద ఆరు ఇంకుడు గుంతలను మంజూరు చేయగా, పూర్తయిన వాటిని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య పరిశీలించి, తగు సూచనలు చేశారు.
అదేవిధంగా, ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధి హామీ పని దినాలు లభిస్తాయని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో రోడ్లు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్ డ్యాంల వంటి శాశ్వత నిర్మాణాల కల్పన కూడా ఈ పథకం ప్రధాన లక్ష్యమని, కాబట్టి అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.







