మానుగూరు, 18 November
నిరుపేదల ఆశలు నెరవేరుతున్నాయి, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలు నెరవేరుతున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోందని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో బుధవారం నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండలం, మున్సిపాలిటీ పరిధిలోని సుమారు వెయ్యి మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు నెరవేరడంతో కార్యక్రమ ప్రాంగణం ఆనందోత్సాహాలతో సందడిగా మారింది.
అర్హత ఉండి పెన్షన్ రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి
నూతన పెన్షన్లు మంజూరైనంత మాత్రాన ఇక పెన్షన్లు రావనే అపోహలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే సూచించారు. పేరులో చిన్నపాటి తప్పులు, ఆధార్ కార్డు సమర్పించకపోవడం లేదా ఇతర కారణాలతో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ రానివారు నిరాశ చెందకుండా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. తనకు, సంబంధిత అధికారులకు దరఖాస్తులు అందజేస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
50 మంది, 100 మంది, 200 మంది ఎవరైనా అర్హత ఉండి పెన్షన్ పొందలేకపోతే వారందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఒక్క అర్హుడు కూడా సంక్షేమ ఫలాలకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా కుటుంబంలో నమోదైన సభ్యుడు అనారోగ్యంతో మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తోందని వివరించారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చని, కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలోని పిల్లలు అనాథలుగా మారకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అన్ని కుటుంబాలు ఈ పథకంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళల కోసం సంక్షేమ పథకాల అమలు







