Charla, జూన్ 28
చర్ల మండలం కేశపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాపుల శారద ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
చర్ల మండలం కేశపురం గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాపుల శారద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచవచ్చని తెలిపారు.
"ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి ఇంటి నుంచి 0–5 సంవత్సరాల పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలనకు ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించాలి" అని సర్పంచ్ కాపుల శారద అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.












