బీజాపూర్ (ప్రజా వాయిస్ సహస్ర) నవంబర్ 19
ఛత్తీస్గఢ్ రాష్ట్రం జిల్లా బీమారం పరిధిలో సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో గ్రామీణ యువత కోసం ఉపాధి కల్పన శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు కూడా శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం జిల్లా బీమారం పరిధిలోని జేటీఎఫ్ క్యాంపు మల్మపెంటా, భీమారం ప్రాంతంలో 81వ బెటాలియన్ కమాండెంట్ ముకేష్ కుమార్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్, సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం వివిధ వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలను బుధవారం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని 81వ బెటాలియన్ కమాండెంట్ ముకేష్ కుమార్ సింగ్, సహాయ కమాండెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో బీమారం గ్రామంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువతకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మేసన్ (రాజమిస్త్రీ) వంటి ఉపాధి కల్పించే వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు సాంకేతిక, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిని స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. శిక్షణ పూర్తి అనంతరం యువతకు టూల్స్ అందజేసి, వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి 81వ బెటాలియన్ కమాండెంట్ ముకేశ్ కుమార్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ పవన్ కుమార్ పాల్గొని గ్రామీణ యువతను ఉద్దేశించి మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు సూచించారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రధాన స్రవంతిలోకి వచ్చి లొంగిపోయిన మావోయిస్టులను కూడా కమాండెంట్ ముకేశ్ కుమార్ సింగ్ కలిశారు. వారి ప్రస్తుత జీవన పరిస్థితులు, పునరావాసం, జీవనోపాధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రధాన స్రవంతిలో కలిసిపోయి సానుకూల దృక్పథంతో జీవించాలని వారిని ప్రోత్సహించారు. 81వ బెటాలియన్, డి కంపెనీ సీఆర్పీఎఫ్, భీమారం ప్రాంతంలో భద్రతను కాపాడటంతో పాటు స్థానిక గ్రామీణ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.







