ములుగు, 6 September
విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్వీ () జిల్లా ఇంచార్జ్ కొనుకటి ప్రశాంత్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం BRSV జిల్లా ఇంచార్జ్ కొనుకటి ప్రశాంత్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద BRSV రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ఇంచార్జ్ కొనుకటి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థి, యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న రూ.14 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 97ను రద్దు చేయాలని, మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలని కోరారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRSV జిల్లా నాయకులు దుర్గం రాజు కుమార్, ఎం.డి. సోయల్, ఎల్లబోయిన నాగరాజు, తేజ రెడ్డి, శివ, కిషోర్, సంతోష్, నరేందర్, రాజబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

