Bhadradri Kothagudem/Dhumugudam (ప్రజా వాయిస్ సహస్ర) నవంబర్ 20
భద్రాచలంలో ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ దారుణ హత్యకు నిరసనగా, ఆదివాసీ ఐక్య జేఏసీ శనివారం భద్రాచలం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలో బంద్‌ను ప్రకటించారు.
భద్రాచలంలో ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ దారుణ హత్యను నిరసిస్తూ ఆదివాసీ ఐక్య జేఏసీ శనివారం భద్రాచలం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలో ఈ బంద్‌ను ప్రకటించారు.
ఆదివాసీ బిడ్డకు న్యాయం జరగాలని, హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
భద్రాచలం బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ ఐక్య జేఏసీ విజ్ఞప్తి చేసింది.
ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలని, తెల్లం శరత్ కుటుంబానికి న్యాయం జరగాలని నినదించారు.


