దుమ్ముగూడెం, జూలై 5
దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురం గ్రామంలో వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన త్రీఫేస్ విద్యుత్ సరఫరాను భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గవచ్చని, రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆమె సూచించారు.
దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురం గ్రామంలో వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన త్రీఫేస్ విద్యుత్ సరఫరాను భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతమ్మ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకుని ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ, పెద్ద కమలాపురం సర్పంచ్ సరియం ధనలక్ష్మి, యువ నాయకులు కాగితాల శివకుమార్, యాగడ్డి విష్ణు, వర్ష ప్రసాద్, వరస చంటి, మడకం లక్ష్మయ్య, మడకం రామారావు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.












