ములుగు, 2026-08-13
ములుగు జిల్లాలో ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు.
ములుగు జిల్లాలో ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లతో కలిసి మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు.
పనుల పురోగతిపై ఈఈ వివరణ
ఈ సందర్భంగా మంత్రికి ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్ వివరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని అధికారులను సూచించారు. పైలాన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
నూతన కలెక్టరేట్ పరిశీలన
అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి, భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, పార్కింగ్తో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
పాత్రికేయులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి ఎనిముల రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. మధ్యాహ్నం మేడారం చేరుకుని శ్రీ సమ్మక్కసారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిని గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.


