ములుగు, 2026-07-19
ములుగు జిల్లా వాజేడు మండలం అరుణచలపురం అటవీ ప్రాంతంలోని గుండం జలపాతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన అక్బర్ అనే యువకుడు స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించడానికి వచ్చి, కాలుజారి గుండంలో పడి మృతి చెందాడు. వారం రోజుల్లోనే మరో యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం అరుణచలపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న గుండం జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన అక్బర్ అనే యువకుడు కాలుజారి గుండంలో పడి మృతి చెందాడు.
వారం రోజుల వ్యవధిలోనే మరో విషాదం సంభవించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిషేధిత జలపాతాలకు రావడం, ప్రాణాలు పోగొట్టుకోవడం యువతలో సరదాగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనకు ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నిషేధిత జలపాతాల వద్ద పోలీస్ బందోబస్తుతో నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
నిషేధిత జలపాతాల వద్ద ఫారెస్ట్ అధికారులు ఉన్నప్పటికీ, రుసుములు వసూలు చేసుకుంటూ దొడ్డి దారిన సందర్శకులను అనుమతిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిషేధిత జలపాతాల వద్ద పోలీస్, ఫారెస్ట్ శాఖలు మరింత కట్టుదిట్టంగా బాధ్యతలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.








